Wednesday, July 3, 2019

చరిత్ర

గ్రామస్తులు మరియు పెద్దల  సమాచారం మేరకు -
తలమడుగు గ్రామస్తులు 1976 లో తాంసి (తలమడుగు కు సమీపం లో గల ) గ్రామానికి వచ్చి ,శతావధాని అయినటువంటి  నేరెళ్ళ వెంకట చార్యుల గారి దగ్గరికి వచ్చి ,"మా గ్రామం (తలమడుగు ) వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులందరు అనుకుంటున్నారు అని  చెప్పారు", 1977 లో  నేరెళ్ళ వెంకట చార్యులు గారు వచ్చి,స్థల సేకరణ చేసి 1978 జూన్ 16 న, వేద పండితుల ఆధ్వర్యం లో విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ రోజు నుండి నేటి వరకు గ్రామస్తుల సహకారంతో స్వామి వారు  దూప దీప నైవేద్యాలు (నిత్య ఆరాధనలు ) అందుకుంటున్నారు, మొదట నేరెళ్ళ వెంకట చార్యులు గారు నిత్య ఆరాధనలు జరిపించేవారు ,తరువాత తన కుమారుడు (రెండవ ) నేరెళ్ళ రంగాచార్యులు గారు జరిపించారు ,ప్రస్తుతం తన కుమారుడు (నాలుగవ ) నేరెళ్ళ కళ్యాణ్ కుమార్ గారు జరిపిస్తున్నారు.



No comments:

Post a Comment